తాజాగా నందమూరి బాలకృష్ణ  నటిస్తున్న 107వ చిత్రం కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే.ప్రస్తుతం ఇప్పుడు బాలయ్య వరుస సినిమాలు చేస్తూ బిగుగా ఉన్నారు.అయితే ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇకపోతే  ఈ సినిమాలో బాలయ్య మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తూ తన సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు.అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుండి పోస్టర్స్, టీజర్స్ మాత్రమే రిలీజ్ చేశారు.

ఇకపోతే  ఇంకా ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేయకపోవడంతో నందమూరి బాలకృష్ణ  సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.ఇదిలావుంటే తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో దీనికి సంబంధించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది.ఇకపోతే  బాలయ్య సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారని.. ఈ టైటిల్ ను ఈ నెలలో వచ్చే రాఖీ పండుగ రోజున రివీల్ చేయబోతున్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.అయితే  నందమూరి బాలకృష్ణ  మాస్ ఇమేజ్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ టైటిల్ ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.కాగా  ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ  రెండు విభిన్నమైన లుక్స్ లో కనిపిస్తాడని.. 

అంతేకాదు ఆయన చెప్పే పవర్ ఫుల్ డైలాగులకు అభిమానులు విజిల్స్ వేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.ఇకపోతే ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.అయితే  ఇక హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ఊరమాస్ అవతారం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ అంటోంది.ఇకపోతే మరి బాలయ్య కెరీర్ లో తెరకెక్కుతున్న 107వ చిత్రానికి ఎలాంటి టైటిల్ పెడతారో తెలియాలంటే రాఖీ పండుగ వరకు ఆగాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: