కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినా కిచ్చ సుదీప్ తాజాగా విక్రాంత్ రోనా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అనూప్ బండారి దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో జాక్వలిన్ ఫెర్నాండేజ్ నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ కన్నడ తో పాటు తెలుగు , హిందీ ,  మలయాళ , తమిళ భాషల్లో జూలై 28 వ తేదీన విడుదల అయ్యింది.

మూవీ కి బాక్సా ఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ రావడంతో,  ప్రస్తుతం ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లు దక్కుతున్నాయి. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ కి మంచి వసూళ్లు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదలైన అతి తక్కువ రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్ లను వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం లాభాలను కూడా అందుకుంటోంది. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకొని 1.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే పాజిటివ్ టాక్ రావడంతో అతి తక్కువ రోజుల్లోనే ఈ మూవీ 1.50 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

ఇప్పటి వరకు 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న విలరన్త రోనా మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో 3.71 కోట్ల షేర్ 7.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. దీనితో ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.21 కోట్ల లాభాలను అందుకొని రెండు తెలుగు రాష్ట్రాలలో డబుల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: