టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ పెరిగిపోతున్న నిర్మాణ వ్యయం సమస్యల మధ్య సతమతమైపోతున్న పరిస్థితులలో మరొక సమస్య టాలీవుడ్ ను ఆందోళనకు గురిచేస్తున్నట్లు లీకులు వస్తున్నాయి. ఇండస్ట్రీలో పేరుమోసిన నిర్మాత కూడ తాను తీసే భారీ సినిమాలు అప్పు తీసుకు వచ్చి నిర్మిస్తాడు అన్నది ఓపెన్ సీక్రెట్.


భారీ సినిమాల నిర్మాణం వేగంగా పూర్తి అవ్వాలి అంటే మనీ రొటేషన్ అనుకున్న విధంగా జరగాలి. ఈ రొటేషన్ లో ఏఒక్కచోట బ్రేక్ పడినా నిర్మాతల పరిస్థితి మరింత అయోమయంగా మారుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో అదే జరుగుతోంది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు కొంతమంది బడా వడ్డీ వ్యాపారులు బడా మీడియా సంస్థల అధినేతలు ఫిలిం ఇండస్ట్రీలో భారీ సినిమాలను తీసే నిర్మాతలకు అప్పు ఇవ్వడం గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది.


అయితే ఇప్పుడు ఆ చైన్ కు ఇండస్ట్రీలో బ్రేక్ పడింది అంటున్నారు. దీనికి గల కారణాలు అనేకం వినిపిస్తున్నాయి. క్రితంలా సినిమాలకు కలక్షన్స్ రావడం లేదు. టాప్ హీరోల సినిమాలు కూడ కలక్షన్స్ విషయంలో ఇబ్బింది పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో బడా నిర్మాతలకు భారీ మొత్తాలలో అప్పులు ఇచ్చి వారు సినిమాల పరిస్థితి బాగాలేకపోవడంతో వారితో ఇబ్బంది పడేకన్నా ఆ డబ్బును వేరే చోట పెట్టుబడి పెడితే మంచిది కదా అన్న ఆలోచనలలో ఉన్నట్లు లీకులు వస్తున్నాయి.


ప్రస్తుతం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ మళ్ళీ స్వింగ్ లోకి వచ్చింది. దీనితో ఈవ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. దీనితో బడా సినిమా నిర్మాతలకు అప్పులు ఇచ్చి తిప్పలు పడేకంటే బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పులు ఇస్తే వడ్డీలతో పాటు అసలకు సమస్య ఉండదు కదా అన్న భావనతో బడా మనీ లెండర్స్ ఆలోచనలు మారడంతో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మనీ రొటేషన్ కు బ్రేక్ పడింది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: