ఆగస్టు 9వ తేదీ కోసం సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన నటుడు పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరపడం కోసం సూపర్ స్టార్ అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడమే కాకుండా అభిమానులకు ఆ రోజు స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి నిర్వాహకులు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలను రీ రిలీజ్ చేయనున్నారు.ఇక ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కూడా పలు థియేటర్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన పోకిరి సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.ఇప్పటికే అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్ ఓపెన్ కావడంతో టికెట్స్ ఓపెన్ అయిన గంటల వ్యవధిలోనే బుకింగ్స్ క్లోజ్ కావడం అందరిని కూడా చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పోకిరి సినిమా టికెట్లు మాత్రం వెంటనే హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. ఇక ఈ విధంగా అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్ ఓపెన్ కాగానే టికెట్స్ క్లోజ్ అవడంతో మరికొన్ని థియేటర్లను కూడా పెంచే యోచనలో నిర్వాహకులు ఉన్నారు.


సినిమా కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా విదేశాలలో కూడా పలు థియేటర్లలో ప్రదర్శితం అవుతుంది.అయితే ఇక తాజాగా ఈ సినిమా కేరళలో కూడా స్పెషల్ షో ప్లాన్ చేసినట్లు సమాచారం తెలుస్తోంది .ఇలా తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా పక్క రాష్ట్రాలలో కూడా పోకిరి సినిమా విడుదల కావడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ ఎలా ఉందో అర్థం అవుతుంది. మహేష్ బాబు కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన పోకిరి సినిమాతో పాటు కొన్ని సెలెక్టెడ్ థియేటర్లలో ఆయన కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఒక్కడు సినిమాని కూడా రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది.ఏది ఏమైనా కానీ విడుదలైన కొన్ని సంవత్సరాలకు తిరిగి సినిమాలు విడుదలవుతూ ఉండగా ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం విశేషం. ఇక ఈ సినిమాల ద్వారా వచ్చిన డబ్బు  మొత్తం కూడా మహేష్ బాబు ఫౌండేషన్ కి విరాళంగా ఇస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: