టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన నితిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జయం మూవీ తో కెరీర్ మొదలు పెట్టిన నితిన్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నితిన్ తాజాగా ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం అనే మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా , ఈ మూవీ కి మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ లో సముద్ర కని ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఆగస్ట్ 12 వ తేదీన ఈ మూవీ ని భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ మూవీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగిపోయింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు తెలుసుకుందాం.

నైజాం : 6 కోట్లు .
సీడెడ్ : 3 కోట్లు .
ఆంధ్ర : 10 కోట్లు .
మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మాచర్ల నియోజకవర్గం మూవీ 19 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుగుతుంది .
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 1 కోటి .
ఓవర్ సీస్ లో : 1.20 కోట్లు .
ప్రపంచ వ్యాప్తంగా మాచర్ల నియోజకవర్గం మూవీ 21.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే ప్రపంచ వ్యాప్తంగా 22 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేయవలసి ఉంది. మరి ఈ మూవీ ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: