టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు ఆయన కిరణ్ అబ్బవరం 'రాజా వారు రాణి గారు' మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ తర్వాత ఈ యువ హీరో ఎస్ ఆర్ కళ్యాణమండపం మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఎస్ ఆర్ కళ్యాణమండపం మూవీ ఇచ్చిన జోష్ లో కిరణ్ అబ్బవరం వరుస మూవీ లలో నటించాడు. అందులో భాగంగా ఈ హీరో నటించిన సేబాస్టియన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలవగా , సమ్మతమే సినిమా బాక్సా ఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే మూవీ లో హీరోగా నటించాడు. కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్యమూవీ ని నిర్మిస్తోంది.

మూవీ లో కిరణ్ అబ్బవరం కి జోడీగా సంజనా ఆనంద్ హీరోయిన్ గా నటించింది.  సెప్టెంబర్  9 వ తేదీన ఈ మూవీ ని రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగ వంతంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అలా ఈ మూవీ ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు కాస్త అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ తో ఆయన కిరణ్ అబ్బవరం బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: