మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న రామ్ చరణ్ ఈ సంవత్సరం మార్చ్ 25 వ తేదీన విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాడు.

మూవీ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక హీరోగా నటించగా , దర్శక ధీరుడు రాజమౌళిమూవీ కి దర్శకత్వం వహించాడు. ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో కీయారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , సునీల్ , అంజలిమూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. దిల్ రాజు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.

ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితమే మెగా పవర్ స్టార్ రామ్ , చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తేరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. రామ్ చరణ్  , గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ మూవీ ప్రస్తుతం రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ముగిసిన తర్వాత ప్రారంభం కాబోతున్నట్లు కూడా అనేక వార్తలు వచ్చాయి. కాకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ , గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ మూవీ ఆగిపోయినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: