సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి చేయబోతున్న పాన్ ఇండియా సినిమాకి సంబంధించి మహేష్‌ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్‌ బయటకు అయితే వచ్చింది


రాజమౌళి ఊహకందని ప్లాన్‌ వేశాడు. నిజంగా ఈ ప్లాన్ వర్కౌట్ అయితే ఇక బాక్సాఫీస్‌ కి చుక్కలే. ఆ రేంజ్ లో ఈ సినిమా రాబోతుందట.. ఇంతకీ ప్లాన్ ఏమిటో తెలుసా ?, మహేష్‌ సినిమాని అంతర్జాతీయ మూవీగా తెరకెక్కించబోతున్నాడు. అందుకే, ఏకంగా ఓ హాలీవుడ్‌ టాలెంట్‌ కంపెనీ `క్రియేటివ్‌ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ`(సీఏఏ)తో రాజమౌళి ఇప్పటికే ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడని సమాచారం . ఎలాగూ ఆర్‌ఆర్‌ఆర్‌`తో అంతర్జాతీయంగా, ముఖ్యంగా వెస్ట్ సైడ్‌ కంట్రీస్‌ నుంచి ప్రశంసలు దక్కించుకున్నాడు జక్కన్న. ఇప్పుడు ఇంటర్ నేషనల్ వైడ్ గా ప్రశంసలు కోసం కసితో ఈ సినిమా చేసున్నాడట.ఇక రాజమౌళి టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో మహేష్ తో చేయబోయే సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. 'మహేష్ తో చేయబోయే సినిమా కథ.. ప్రపంచాన్ని చుట్టి వచ్చే ఓ సాహసికుడి కథ' అని, ఇదొక యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ అని రాజమౌళి తెలిపాడు. మొత్తంగా ఈ కథ ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ నేపథ్యంలో సాగనుంది. ఆ ఫారెస్ట్‌ లో ఉన్న నిధుల గుట్టల పై ఈ సినిమా సాగుతుంది. అంటే.. ఆ నిధుల కోసం ప్రపంచ సాహస వీరులు అంతా పోటీ పడతారు. ఎవరికీ వారు ఎత్తులకు పై ఎత్తులు వేసి.. ప్రత్యర్థులను చంపుతూ నిధి వేటకు బయలు దేరుతారు. క్లుప్తంగా చెప్పుకుంటే ఈ సినిమా కథ ఇదే.


కాకపోతే.. ఫారెస్ట్‌ లో జరిగే యాక్షన్‌ ఎడ్వెంచరెస్‌ సీన్లు చాలా అద్భుతంగా ఉంటాయట. ఎలాగూ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించడంలో రాజమౌళి ని మించినోళ్ళు లేరు. కాబట్టి.. సినిమా ఎలా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ నేపథ్యం ఇండియన్ సినిమాకి పూర్తిగా కొత్త నేపథ్యం. ఇంతవరకు భారతీయ సినీ చరిత్రలో ఆ నేపథ్యంలో సినిమా రాలేదు. ఇప్పుడు మహేష్ చేస్తే.. కచ్చితంగా ఇండియా వైడ్ గా ఈ సినిమా పై ఆసక్తి ఉంటుంది.


అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో ఇంకా క్లారిటీ అయితే లేదు. ఎప్పటిలాగే రాజమౌళి ఈ సినిమాని నేషనల్ వైడ్ గా భారీ సినిమాగా ప్లాన్ చేస్తున్నాడు. రాజమౌళి హీరో అంటేనే.. మాస్ కి పరాకాష్ట. అందుకు తగ్గట్టుగానే హీరో లుక్ ను రాజమౌళి డిజైన్ చేస్తాడు. ఈ క్రమంలోనే మహేష్ లుక్ కోసం జక్కన్న ప్రత్యేక కసరత్తులు చేశాడు. గతంలో ఏ సినిమాలో కనిపించని విధంగా మహేష్ ఈ సినిమాలో కనిపించనున్నాడు 


ఐతే, ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో పట్టాలెక్కనుందని పుకార్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 2024 జనవరి చివర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట.. ఇక ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 2025 జనవరి 12వ తేదీని లాక్ చేశారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: