గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ మూవీ రేపు అనగా సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో చియన్ విక్రమ్ ,  కార్తీ ,  జయం రవి ,  ఐశ్వర్య రాయ్ ,  త్రిష ముఖ్య పాత్రలలో నటించగా ,  ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. అందులో మొదటి భాగం రేపు అనగా సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు ,  కన్నడ ,  హిందీ ,  మలయాళ భాషల్లో ఒకే సారి విడుదల కాబోతోంది.

మూవీ పై తమిళ ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల అంచనాలు మరింతగా పెరిగాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ మూవీ ని తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే పొన్నియన్ సెల్వన్ మూవీ తెలుగు రాష్ట్రాలలో ఎన్ని థియేటర్ లలో విడుదల కాబోతుందో తెలుసుకుందాం.
 
నైజాం :  190 .
సిడెడ్ : 100 ప్లస్ .
ఆంధ్ర :  260 ప్లస్ .
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి పొన్నియన్ మూవీ 550 ప్లస్ థియేటర్ లలో విడుదల కాబోతోంది. ఇది ఇలా ఉంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: