ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5 వ తేదీన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి మూడు సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. అందులో రెండు సినిమాలు సీనియర్ స్టార్ హీరోల సినిమాలు కాక ,  మరొకటి కుర్ర హీరో బెల్లంకొండ గణేష్ ది. ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ మరియు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన ది ఘోస్ట్ మూవీ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదిరిపోయే రేంజ్ అంచనాలు కలిగి ఉన్నాయి. అలాగే బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కిన స్వాతిముత్యం మూవీ పై కూడా పర్వాలేదు అనే రేంజ్ లో తెలుగు రాష్ట్రాల్లో అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే గాడ్ ఫాదర్ , ది ఘోస్ట్ ,  స్వాతిముత్యం మూవీ టికెట్ ధరలు  ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ టికెట్ ధరలు ఏ ఎం బి థియేటర్ లో 295 గాను ,  ప్రసాద్ థియేటర్ లో 250 రూపాయలు గాను మరియు ఇతర థియేటర్ లలో 180 నుండి 200 రూపాయలు గాను ఉండనునట్లు తెలుస్తుంది.
నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ది ఘోస్ట్ మూవీ టికెట్ ధరలు ఏ ఎం బి థియేటర్ లో 295 రూపాయలు గాను ,  ప్రసాద్ థియేటర్ లో 200 రూపాయలు గాను ఇతర థియేటర్లలో 180 నుండి 200 రూపాయలుగా ఉండనున్నట్లు తెలుస్తుంది.
బెల్లంకొండ గణేష్ హీరోగా లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన స్వాతిముత్యం మూవీ టికెట్ ధరలు ఏ ఎం బి థియేటర్ లలో 250 గాను ప్రసాద్ థియేటర్ లలో 200 రూపాయలుగాను ఇతర థియేటర్లలో 180 నుండి 200 రూపాయలు గాను ఉండనున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: