ఎస్ ఎస్  రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పెద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమా ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసింది.రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిన సినిమాగా పలు రికార్డులు దక్కించుకుంది. ఆ విషయం పక్కన పెడితే అంతకు మూడు నాలుగు రెట్ల అదనపు విజయాన్ని ఓటీటీ ద్వారా ఈ సినిమా దక్కించుకుందనే చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల అయ్యి ఆరు నెలలకు పైగానే అయ్యింది. అయినా కూడా ఇప్పటి వరకు ఏమాత్రం సందడి తగ్గలేదు. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ప్రతి వారం కూడా టాప్ 10 లో నిలుస్తోంది. హాలీవుడ్ సినిమాలు.. వెబ్ సిరీస్ లు ఇతర విదేశీ భాషల సినిమాలు ఇలా ఎన్ని వచ్చినా కూడా తగ్గకుండా జోరుగానే సినిమా వసూళ్లు సాధిస్తోంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 2 వరకు టాప్ 10 జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో ఆర్ ఆర్ ఆర్ నిలవడం జరిగింది. వరుసగా అన్ని వారాల్లో కూడా ఈ సినిమా టాప్ లో నిలుస్తోంది.


తాజాగా ఈ వీక్ దాదాపుగా 12 లక్షల గంటల వాచ్ టైమ్ ను ఈ బాహుబలి దర్శకుడు తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా దక్కించుకుందని అధికారికంగా ప్రకటన వచ్చింది.ఈ మూవీ ఇటీవలే వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్ పై స్క్రీనింగ్ అయిన విషయం తెల్సిందే. ఇప్పటి వరకు ఆ జోరు గురించి చర్చించుకుంటున్న సమయంలోనే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ ఓటీటీ జోరు గురించిన ప్రకటన సినిమా స్థాయిని మరింతగా పెంచింది అనడంలో సందేహం లేదు. ఈ మూవీ అంతర్జాతీయ వేదికపై అద్భుతమైన ఆధరణ దక్కించుకుంటుంది. ఆస్కార్ అవార్డ్ ఆశించి నిరాశపడిన యూనిట్ సభ్యులకు ఈ రికార్డ్ అనేది మంచి బూస్ట్ అనుకోవచ్చు. ఇక చూడాలి ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో.. ఇక ఆర్ ఆర్ ఆర్ ఇచ్చిన విజయంతో రాజమౌళి చాలా ఉత్సాహంగా వున్నాడు. అందుకే తన తరువాతి సినిమా టాలీవుడ్ నెంబర్  వన్  హీరో అయిన  సూపర్  స్టార్  మహేష్ బాబుతో చెయ్యనున్నాడు. ఆ సినిమాని కనీవినీ ఎరుగని రీతిలో పాన్ వరల్డ్ రేంజిలో తీయాలనీ జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. చూడాలి ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR