గరికపాటి చిరంజీవి వివాదం గత కొన్ని రోజుల నుంచి బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిరు సోదరుడు నాగబాబు, ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చేసిన రచ్చ శ్రుతి మించింది. అది సరిపోదని 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్లో వరుసబెట్టి ఒక్కొక్కరుగా గరికపాటి మీద కౌంటర్లు వేయడం, చిరును కొనియాడడం చాలామందికి రుచించలేదు. గేయ రచయిత అనంత శ్రీరామ్ 'గరిక' అనే పదాన్ని వాడుతూ గరికపాటి గౌరవాన్ని తగ్గించేలా వ్యాఖ్యలు చేయగా.. సినిమాటోగ్రాఫర్ ఛోటా కే నాయుడేమో 'వాడు' అని సంబోధించేశాడు గరికపాటి వారిని. దర్శకుడు బాబి సైతం గరికపాటి మీద పరోక్ష విమర్శలు గుప్పించాడు. తాను చేసిందాని పట్ల గరికపాటి చిరు అభిమానుల దగ్గర ఇప్పటికే పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.నిజానికి పాపం ఆయన చేసింది మహా పాపం అయితే కాదు. చిరును ఆయనేమీ దూషించలేదు కూడా. చిరుని దయచేసి ఫోటో శేషన్ ఆపండి అని అన్నారు అంతే. అది మరీ అంత పెద్ద తప్పు అయితే కాదు.


పాపం ఆయన చేసిన ఈ చిన్న తప్పిదానికి ఆయన మీద ఈ స్థాయిలో ఇంతమంది అదే పనిగా దాడి చేయడం అన్నది కరెక్టా అని ఆలోచించాలి. ఆ సంఘటనలో చిరు ప్రవర్తన అందరినీ మెప్పించి ఆయనపై ప్రశంసలు కురిశాయి. అంతటితో ఈ వ్యవహారం ముగిసి ఉంటే చిరు ఉన్నత స్థాయిలో ఉండేవారు. కానీ అదే పనిగా గరికపాటి మీద ఇలా దాడి చేయడం ద్వారా చిరు గౌరవాన్ని తగ్గించి, ఆయనపై వ్యతిరేకతను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా ఈ వివాదానికి ఇంతటితో తెరదించడం మంచిది.మెగాస్టార్ చిరంజీవి ఒక పెద్ద మనిషిగా దీన్ని ఇక్కడితో ఆపమని అభిమానులకు చెబితే ఆయన పట్ల వున్న గౌరవం మరింత ఎక్కువవుతుంది. మరి చూడాలి చిరు స్పందిస్తాడో లేడో..

మరింత సమాచారం తెలుసుకోండి: