ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు అయిన 'సలార్' ప్రాజెక్ట్ కె' ల నుంచి కూడా భారీ అప్ డేట్ లు సరికొత్త లుక్ లు రాబోతున్నాయి. ఈ రెండు ప్రాజెక్ట్ లలో 'సలార్ ' లుక్స్ ఇప్పటికే రివీల్ అయిన విషయం తెలిసిందే.ఈ ప్రాజెక్ట్ నుంచి మరో భారీ అప్ డేట్ ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. దీనికి కోసం 'సలార్' టీమ్ కూడా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక 'ప్రాజెక్ట్ కె' నుంచి ఇంత వరకు ప్రభాస్ లుక్ పోస్టర్ బయటికి రాకపోవడంతో ఫ్యాన్స్ ఈ మూవీ నుంచి కూడా క్రేజీ అప్ డేట్ ని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ నటించిన క్రేజీ సినిమాల 4 కె ప్రింట్ ల హడావిడీ కూడా పీక్స్ కి చేరిపోయింది. ఈ మధ్య స్టార్ హీరోల క్రేజీ సినిమాలని 4కెలోకి మార్చి రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ వరుసలో ప్రభాస్ నటించిన క్రేజీ సినిమా  బిల్లా 4కెలో పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ కు రెడీ అవుతుంది.



 ప్రభాస్ అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. దీంతో ఫ్యాన్స్ భారీ స్థాయిలో సెలబ్రేషన్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. ప్రభాస్  వర్షం సినిమాని కూడా 4కెలో రీ రిలీజ్ చేయాలనే ప్రయత్నాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కాని ఆ సినిమా సెలబ్రేట్ చేసుకోవాలని ఆశగా ఎదురుచూసిన ఫ్యాన్స్ కి వర్షం రిలీజ్ డేట్ మార్పు రూపంలో భారీ నిరాశ ఎదురుకాబోతోంది.అందుకే వర్షం 4కె ప్రింట్ ని రిలీజ్ చేయడం లేదని తెలిసింది. ఆ సమయంలో కేవలం 'బిల్లా' 4 కె ప్రింట్ ని మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ ని దర్శకుడు మెహర్ రమేష్ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నాడు.ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట ట్రెండ్ అవుతూ ప్రభాస్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: