కన్నడ సినిమా ‘కాంతార’ కేవలం కన్నడంలోనే కాకుండా మన తెలుగులో కూడ ఘన విజయం సాధించడంతో ప్రేక్షకులు రఫ్ క్యారెక్టర్స్ ఉన్న సినిమాలను ఆదరిస్తున్నారు అన్నవిషయం స్పష్టంగా తెలిసిపోయింది. 'కాంతార’ కన్నడ 'రంగస్థలం 2’ అంటూ విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్న పరిస్థితులలో ఈవిషయాలు అన్నీ సుకుమార్ దృష్టికి రావడంతో సుకుమార్ ఆలోచనలలో 'పుష్ప 2'’ ప్రాజెక్ట్ ఉంది అంటూ ప్రచారం మొదలైంది.


వాస్తవానికి ‘రంగస్థలం’ విడుదలైన తరువాత ఆసినిమాకు సీక్వెల్ ఉంటుంది అంటూ ప్రచారం ఉంది. అయితే ఆ సీక్వెల్ కార్యరూపం దాల్చలేదు. ‘రంగస్థలం’ మూవీ క్లైమాక్స్ లో చిట్టిబాబు పాత్రలో ఉన్న రామ్ చరణ్ ప్రకాష్ రాజ్ ను చంపడంతో ఆమూవీ కథ అయిపోయింది. అయితే ఆతరువాత చిట్టిబాబు పాత్ర ఎలాంటి మలుపులు తీసుకుంది అన్న పాయింట్ చుట్టూ ‘రంగస్థలం 2’ ఉంటుంది అంటున్నారు.


‘కాంతార’ ఘనవిజయం తరువాత సుకుమార్ కు ‘రంగస్థలం 2’ సీక్వెల్ ఆలోచనలు మళ్ళీ మొదలయ్యాయని దీనికి సంబంధించిన కథ గురించి ‘పుష్ప 2’ పనులలో బిజీగా ఉన్నప్పటికీ సుకుమార్ ఈవిషయమై ఆలోచిస్తున్నాడని అంటున్నారు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ‘పుష్ప 2’ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తి అయిన తరువాత ‘రంగస్థలం 2’ కు సంబంధించి ఒక అధికారిక ప్రకటన ఉంటుంది అంటున్నారు. ఈమధ్య కాలంలో ప్రేక్షకుల అభిరుచులలో వచ్చిన మార్పులతో చాల సహజంగా ఉంటూ ఎటువంటి మేకప్పులు లేకుండా నటీనటులు నటించే సినిమాలను ప్రేక్షకులు చూస్తున్నప్పటికీ ఆసినిమాలలో టెక్నికల్ గా మంచి క్వాలిటీ ఫోటోగ్రాఫీ గ్రాఫిక్స్ కోరుకుంటున్నారు.


ఈవిషయమై ‘కాంతార’ ఘనవిజయం మరొకసారి రుజువు చేసింది. ఈసినిమా కర్ణాటకలో ‘ఆర్ ఆర్ ఆర్’ ‘కేజీ ఎఫ్ 2’ కలక్షన్స్ ను మించి వసూళ్లు చేస్తూ ఉండటంతో ఈమూవీ ఘన విజయాన్ని చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆస్చ్ర్యపోతున్నాయి. ఇప్పుడు ఈ లేటెస్ట్ ట్రెండ్ సక్సస్ ఫార్మిలాకు  చిరునామాగా మారడంతో ‘రంగస్థలం’ ‘కాంతార’ లాంటి కథల కోసం  దర్శకుల ఆలోచనలు కొనసాగుతాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: