తాజాగా లేడీ సూపర్ స్టార్ నయన్ దంపతులు తమ కవల పిల్లలతో కలిసి దీపావళికి ఫెస్టివల్ విషెస్ కూడా చెప్పారు. నయనతార మరియు, విఘ్నేష్ ఇరువురు తమ పిల్లలను ఎత్తుకొని ఎంతో క్యూట్ గా పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరల వుతుంది. 'జీవితం లో మీకు వ్యతిరేకంగా ఏర్పడే అన్ని అడ్డంకుల మధ్య మీ ప్రియమైన వారిందరికీ ఆనందం, శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఈ దంపతులు పేర్కొన్నారు. కష్టపడి ప్రార్థించండి.. కష్టపడి ప్రేమించండి. ప్రతి ఒక్కరికీ మనం ఇవ్వగలిగేది ప్రేమ మాత్ర మే.. ఈ జీవితాన్ని మరింత అందంగా, సంపన్నంగా మారుస్తుంది. కేవలం భగవంతుడి పై నమ్మకం.. ప్రేమ ఉంచండి.. ఇతరుల కు మంచి చేయండి.. మీ నమ్మకంలో ప్రపంచంలో ప్రతిదీ ఎప్పుడూ అందంగా ఉండే లా చూసుకుంటుంది' అంటూ రాసుకొచ్చారు విఘ్నేష్ ఇలా
దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమలో ఉన్న నయన్.. విఘ్నేష్.. జూన్ 9న వివాహబంధంతో ఒక్కటయ్యారు. అంతేకాకుండా అక్టోబర్ 9న తాము కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యామని ట్వీట్ చేసి చిక్కుల్లో పడ్డారు ఈ జంట అని చెప్పొచ్చు. నయన్ దంపతులకు పెళ్లి జరిగి కేవలం నాలుగు నెలలు మాత్రమే అవుతుంది. దీంతో వీరి సరోగసి పద్దతి ద్వారా పిల్లలకు జన్మనివ్వడం బాగా వివాదస్పదంగా మారింది మరీ
దీంతో రంగంలోకి దిగిన తమిళనాడు ప్రభుత్వం.. పిల్లల జననంపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే తమకు ఆరేళ్ల క్రితమే చట్టబద్ధంగా వివాహం జరిగిందంటూ నయన్ దంపతులు ప్రభుత్వానికి తెలియజేసినట్లుగా మనకు సమాచారం
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి