టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో మూవీ లలో హీరోగా నటించి అలాగే ఎన్నో సినిమా లలో ఇతర పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను ఎంత గానో అలరించిన అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లరి నరేష్ ఆఖరుగా వైవిద్యమైన మూవీ నాంది మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన నాంది సినిమా అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది , అలాగే నాంది సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్లు కూడా లభించాయి.  చాలా కాలం బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయం లేని అల్లరి నరేష్ "నాంది" మూవీ తో సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అల్లరి నరేష్  , ఏ ఆర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన  "ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం" అనే సినిమాలో హీరో గా నటించాడు.

మూవీ లో ఆనంది , అల్లరి నరేష్ సరసన హీరోయిన్ గా నటించింది.  ఈ మూవీ ని నవంబర్ 25 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ నుండి ఇప్పటికే చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను మరియు కొన్ని సాంగ్స్ ను విడుదల చేయగా , వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ మూవీ నుండి ఈ సినిమా బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఎంత గానో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం తో ఇట్లు మారేడుమిల్లి మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానితో నరేష్ హీరోగా తెరకెక్కిన ఇట్లు మారేడుమిల్లి మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల మేర వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కనుక 4.5 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా సాధించినట్లు అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: