తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి లోకేష్ కనకరాజు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లోకేష్ కనకరాజు ఇప్పటికే మా నగరం , ఖైదీ , మాస్టర్ , విక్రమ్ మూవీ లకు దర్శకత్వం వహించి దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోవడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఈ దర్శకుడి కి  అద్భుతమైన క్రేజ్ ఉంది. ఈ సంవత్సరం విడుదల అయిన విక్రమ్ మూవీ తో లోకేష్ కనకరాజు అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించడం తో , ఈ దర్శకుడి కి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజీ లభించింది.

మరికొన్ని రోజుల్లో లోకేష్ కనకరాజు , దళపతి విజయ్ హీరోగా తెరకెక్కబోయే మూవీ కి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ మూవీ దళపతి విజయ్ కెరియర్ లో 67 వ మూవీ గా రూపొందబోతుంది. ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక మూవీ ని చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ దర్శకుడు ప్రభాస్ కు కథను వినిపించడానికి ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో కనక సినిమా రూపొందినట్లు అయితే ఆ సినిమాకు దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ నెలకొనే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: