మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. సినీ ఇండస్ట్రీలో అనేక సినిమాలు చేసి మంచి గుర్తింపు పొందారు. ఇదిలావుంటే ఇక చిరంజీవి అల్లు రామలింగయ్య కూతురు సురేఖను వివాహం చేసుకున్న తర్వాత చిరంజీవికి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి.ఇక ఈ దంపతులకు సుస్మిత , శ్రీజ , రామ్ చరణ్ జన్మించిన విషయం తెలిసిందే. ఇకపోతే పెద్ద కుమార్తె సుస్మిత గురించి అందరికీ తెలిసిందే. కానీ ఆమె భర్త బ్యాక్ గ్రౌండ్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు.అయితే  ప్రస్తుతం ఆమె చెన్నైలో స్థిరపడినట్టు .. వ్యాపార కుటుంబంలోకి కోడలిగా అడుగు పెట్టినట్లు సమాచారం.

 అంతేకాదు ముఖ్యంగా సుస్మిత అత్తగారి కుటుంబం రాయలసీమ నుంచి వచ్చి తమిళనాడులో స్థిరపడ్డారు.ఇక  ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఎల్.వి.రామారావు పెద్ద పేరు మోసిన బిజినెస్ మేన్.కాగా  అప్పట్లోనే అమెరికా, థాయిలాండ్ ,సింగపూర్, జపాన్ వంటి దేశాలతో ఆయన వ్యాపార లావాదేవీలు నడిపేవారు.ఇక అలా ఎల్వి ప్రసాద్, చంద్రిక దంపతుల కుమారుడే విష్ణు ప్రసాద్. ఈ విష్ణు ప్రసాద్ కి చిరంజీవి తన కూతురు సుస్మిత నిచ్చి వివాహం చేశారు. ఇకపోతే విష్ణు ప్రసాద్ బిజినెస్ రంగంలో అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ పూర్తి చేశారు.కాగా  విదేశాల్లో చదువు పూర్తయి వారి వ్యాపారాలను చూసుకుంటున్నారు.

 ఇక విష్ణు ప్రసాద్ తాతయ్య మొదలుపెట్టిన పామాయిల్ వ్యాపారం.. తన తండ్రి సారాధ్యంలో కొంత డెవలప్ అయింది.అయితే  ఆ తర్వాత విష్ణు ప్రసాద్ బాధ్యతలు చేపట్టి ఆ వ్యాపారాన్ని ఇప్పుడు రెండింతలు చేశాడు. అంతేకాదు ప్రపంచ దేశాలకే మేలురకం పామాయిల్ ఎగుమతి చేయడం మొదలుపెట్టిన విష్ణు ప్రసాద్ ప్రస్తుతం కోటానుకోట్లకు అధిపతి.ఇక ప్రపంచంలోనే ఇంత పేరు మోసిన వ్యక్తిని చిరంజీవి అల్లుడిగా తెచ్చుకోవడం నిజంగా గర్వకారణమని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు అమ్మాయిలు.కాగా సుస్మిత సినీ రంగంలో అడుగుపెట్టింది . ఇక చిరంజీవి మరియు రామ్ చరణ్ సినిమాలకు స్టైలిష్ గా వ్యవహరించడానికి కారణం కూడా ఆమె భర్త విష్ణుప్రసాద్.. భర్త ప్రోత్సాహంతోనే తనకు నచ్చిన ఫీల్డ్లో దూసుకుపోతోంది సుస్మిత..!!

మరింత సమాచారం తెలుసుకోండి: