అయితే ఈసారి మాత్రం బ్రేకు లేకుండా హారర్ ఎంటర్టైన్మెంట్ చిత్రంతో భయపెట్టడానికి సిద్ధమయ్యింది నయనతార. నయనతార కనెక్ట్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను డైరెక్టర్ అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ట్విట్టర్ వేదికగా నయనతార భర్త , నిర్మాత విగ్నేష్ పంచుకున్నారు. అంతేకాదు మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. "హారర్ కాన్సెప్ట్ గా తెరకెక్కిన కనెక్ట్ సినిమా డిసెంబర్ 22న థియేటర్లలో విడుదల చేస్తున్నామని.. 99 నిమిషాల నిడివి గల ఈ చిత్రం ఇంటర్వెల్ లేకుండా ప్రదర్శించబడుతుందని స్పష్టం చేశారు".U/A సర్టిఫై పొందిన ఈ హారర్ మూవీలో లేడీ సూపర్ స్టార్ నటన కొత్తగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నయనతార పుట్టినరోజు నవంబర్ 18వ తేదీన కనెక్ట్ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయగా.. ఈ సినిమా ఆడియన్స్ కు మంచి హారర్ మూవీ ఎక్స్పీరియన్స్ గ్యారెంటీ ఇస్తుందని తెలుస్తోంది. రౌడీ పిక్చర్స్ బ్యానర్స్ పై నిర్మించిన ఈ సినిమాలో సత్యరాజు, అనుపమ ఖేర్, వినయ్ నఫీస్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ అనుపమ ఖేర్ ఇటీవల తెలుగులో కార్తికేయ 2 సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పుడు కనెక్ట్ సినిమాతో కోలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్నారు. పక్క బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి