తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లతో తమిళ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న విజయ్ తాను నటించిన తుపాకీ మూవీ ని తెలుగు లో విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి మార్కెట్ ను సృష్టించుకున్నాడు . ఆ తర్వాత ఎన్నో మూవీ లను తెలుగు లో విడుదల చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తలపతి విజయ్ "వరిసు" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో రూపొందుతున్న ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. 

మూవీ ని 2023 వ సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు లో వారసుడు అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాల థియేటర్ హక్కులను అమ్మివేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ చిత్ర బృందం ఇప్పటికే ఈ మూవీ యొక్క ఓవర్సీస్ హక్కులను కూడా అమ్మివేసింది. ఈ మూవీ ఓవర్సీస్ హక్కులను "పీ హెచ్ ఎఫ్" సంస్థ దక్కించుకుంది. అలాగే ఈ మూవీ ని ఈ సంస్థ ఓవర్సీస్ లో గ్రాండ్ గ రిలీజ్ చేయనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించింది. తలపతి విజయ్ అభిమానులు ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: