సాధారణంగా సినిమాలకు రాజకీయాలకు మధ్య ఎన్నో ఏళ్ల నుంచి ప్రత్యేకమైన బంధం కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎంతోమంది సినిమాల్లో రాణించి స్టార్లుగా ప్రస్తానాన్ని కొనసాగించిన వారు ఇక ఆ తర్వాత కాలంలో మాత్రం రాజకీయాల్లో అడుగుపెట్టి ఇక అక్కడ విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించి ఎన్నో కీలకమైన పదవులు చేపట్టిన వారు ఉన్నారు అని చెప్పాలి. ఎన్టీ రామారావు లాంటి వారు ఏకంగా రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించి కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన కేవలం 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించారు.


 ఇలా సినిమా ఇండస్ట్రీలో కొనసాగిన వారు ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వెళ్లడం పరిపాటిగా మారింది. అయితే ఇలా పాలిటిక్స్ లోకి వెళ్ళిన వారు కొంతమంది సక్సెస్ అయితే మరి కొంతమంది మాత్రం పెద్దగా సక్సెస్ కాలేక మళ్ళీ సినిమాల వైపు నడిచిన వారు కూడా ఉన్నారు. అయితే సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్లి మొట్టమొదటిసారిగా కీలక పదవి చేపట్టిన వారు ఎవరు అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. ఆ నటుడు ఎవరో కాదు తెలుగు చిత్ర పరిశ్రమలు  దిగ్గజ నటుడిగా పేరు సంపాదించుకున్న జగ్గయ్య అని చెప్పాలి.


 వందల సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు జగ్గయ్య. అయితే ఈయన రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత 1967లో ఒంగోలు నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. ఇక ఆ ఎన్నికల్లో విజయం సాధించి లోక్సభలో అడుగుపెట్టారు ఆయన. ఇలా లోక్ సభ లో అడుగుపెట్టిన తొలి భారతీయ సినీ నటుడిగా జగ్గయ్య రికార్డు సృష్టించారు. ముఖానికి రంగులు వేసుకునేవారు రాజకీయాలకు పనికిరారు అన్న వారి చేతే శభాష్ అనిపించుకున్నాడు. 1956 లో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పిలుపు మేరకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: