తాజాగా దళపతి విజయ్ హీరోగా నటించిన వారసుడు సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాలో నటించిన హీరో శ్రీకాంత్ ఈ సినిమా రిలీజ్ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా కెరియర్ లో నేను తమిళ సినిమా చేయడం ఇదే మొదటిసారి. ఈ సినిమాలో నా పాత్ర గురించి చెప్పిన అనంతరం నేను ఈ సినిమా ఓకే చేశాను. ఈ సినిమాలో నేను మరియు  విజయ్ బ్రదర్స్ గా నటిస్తున్నాము. విజయ్ నా లేటెస్ట్ ఫోటోలను చూసి ఈ సినిమాకి నన్ను ఓకే చేశారు. ఈ సినిమాలో నాది చాలా పాజిటివ్ క్యారెక్టర్మ్ ఇటీవల బాలయ్య నటించిన అఖండ 

సినిమాలో పవర్ఫుల్ పాత్ర చేసిన తర్వాత ఒక డిఫరెంట్ పాత్రలో నటించాలని నేను అనుకున్నాను. ఈ క్రమంలోనే వారిసు సినిమాలో అవకాశం రావడంతో ఈ సినిమాకి ఓకే చేశాను. ఇక ఖండా సినిమాలో నటించిన అనంతరం జేమ్స్ సినిమాలో నటించిన దాని తర్వాత ఈ సినిమాల్లో నటిస్తున్నాను. నేను బాలకృష్ణతో ఇటీవల నటించినప్పటికి..చిరు తో నటించి చాలా కాలం అయింది.చిరంజీవితో ఒకసారి ఒక సినిమాలో నటించాలని ఉంది. చిరంజీవి ఒక్కసారి పిలిస్తే చాలు వెంటనే ఆయన సినిమాకి ఓకే చెప్తాను.ఒకవేళ చిరంజీవి సినిమాలో ఏదైనా పాత్ర వస్తే ఆయనతో కలిసి చేయడం కష్టమే. ఆయనకి బ్రదర్స్ పాత్రలో చేయొచ్చు.

కానీ ఆయనతో విలన్ గా చేయాలి అంటే అది కష్టమే. చిరంజీవిని అరేయ్ ఒరేయ్  అని అనడం నావల్ల అసలు కాదు.ఒకవేళ అలాంటి పాత్రే చిరంజీవి సినిమాలో చేయాల్సి వస్తే షూటింగ్ అయిపోయిన తర్వాత ఆయనకు దండం పెట్టి క్షమించండి అని కోరుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు శ్రీకాంత్. అనంతరం ఆయన నటిస్తున్న వారసుడు సినిమా గురించి మాట్లాడుతూ వారసుడు సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్.ఈ సినిమాలో అద్భుతమైన హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి ఈ సినిమా విజువల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి.ఇది తెలుగు తమిళ్ రెండు భాషల్లో విడుదలవుతున్నప్పటికీ పక్కాగా తెలుగు సినిమా లాగానే అనిపిస్తుంది అంటూ తెలిపాడు శ్రీకాంత్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: