తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్గా పేరుపొందింది హీరోయిన్ కీర్తి సురేష్ .మహానటి సినిమా తర్వాత ఇమే కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఒకపక్క కమర్షియల్ హీరోయిన్ గా పలు సినిమాలలో నటిస్తూనే మరొక పక్క తన టేస్ట్ కు తగ్గట్టుగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం తెలుగులో నాని సరసన దసరా సినిమాలో మాత్రమే నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది మార్చి 30 వ తేదీన పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమాతో పాటు చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటిస్తోంది.

అయితే తాజాగా కీర్తి సురేష్ మళ్లీ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ వైరల్ గా మారుతోంది .ఈ చిత్రాన్ని చంద్రు డైరెక్షన్ లో ది రూట్ పాషన్ స్టూడియోస్ బ్యానర్లపై జగదీష్ సుధన్ సుందరం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కూడా ఒక విభిన్నమైన స్టోరీ తో రివాల్వర్ రీటా అనే టైటిల్తో ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు ఒక పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ని హీరోయిన్ సమంత తన ట్విట్టర్ వేదికగా తెలియజేయడం జరిగింది.


ఫస్ట్ లుక్ పోస్టర్లు కీర్తి సురేష్ రెండు గన్స్ పేలుస్తూ పోస్టర్తో అదరగొట్టేసింది.ఇక ఈ పోస్టర్ని షేర్ చేసిన కీర్తి సురేష్ ఇదిగో రివాల్వర్ రాణి రీటా రూట్ అండ్ ఫ్యాషన్ స్టూడియోస్తో కలిసి నిర్మించబోతున్నాము అంటు రాసుకు వచ్చింది. ఈ సినిమా కోసం చాలా ఎక్సైటింగ్ గా ఉన్నానంటూ తెలియజేస్తోంది. ఇక డైరెక్టర్ వెంకట ప్రభు బ్లాక్ బాస్టర్ సినిమా మానాడు సినిమాకు మాటలు అందించిన కే చంద్ర ఈ సినిమాతో డైరెక్టర్ గా మారబోతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: