సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం
టాలీవుడ్ లో ఒక రేంజిలో స్టార్డం ఎంజాయ్ చేస్తున్న హీరో. గత కొంతకాలం నుంచి మహేష్ నుంచి వస్తున్న ప్రతి
సినిమా టాక్ తో సంబంధం లేకుండా
బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఇక వరుస సినిమాలతో బిజీగా ఉండే మహేష్ బాబు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండి అభిమానులకు టచ్ లో ఉంటాడు.గత కొంతకాలం ముందు వరకు కూడా
సూపర్ స్టార్ మహేష్ బాబుకి సినిమాలకి రివ్యూ ఇచ్చే అలవాటు ఉండేది. ఏ భాష
సినిమా అయినా అది చిన్న
సినిమా అయినా పెద్ద
సినిమా అయినా తనకు నచ్చిన
సినిమా గురించి ఏమాత్రం ఇగో లేకుండా సోషల్ మీడియాలో పొగుడుతూ చాలా పాజిటివ్ గా రివ్యూ చెప్పేసేవారు. గత సంవత్సరం కూడా మహేష్ బాబు చాలానే సినిమాలకు తన స్టైల్ లో రివ్యూలు ఇచ్చారు. కానీ ఇప్పుడు
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు రివ్యూలు ఇవ్వడం ఆపేశారు.గత కొంతకాలం నుంచి
సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్
మీడియా ద్వారా ఒక్క
సినిమా గురించి కూడా మాట్లాడింది లేదు. పైగా ఇప్పుడు
సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా సినిమాలు విడుదలయ్యాయి.
మెగాస్టార్
చిరంజీవి "వాల్తేరు వీరయ్య" ఇంకా నందమూరి
బాలకృష్ణ "వీరసింహారెడ్డి" వంటి పెద్ద సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నాయి.
సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబడుతూ మంచి విజయాన్ని సాధించాయి. కానీ మహేష్ బాబు మాత్రం ఈ రెండు సినిమాల గురించి ఒక్క పోస్ట్ కూడా చేయలేదు.నిజానికి మహేష్ ఇలా వేరే సినిమాలను పొగడటం అభిమానులకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే మహేష్ ఎలాంటి ఇగో లేకుండా అన్ని సినిమాల గురించి మాట్లాడితే ఒక్క
హీరో కూడా మహేష్ సినిమాల గురించి మాట్లాడదు. ఈ విషయం పట్ల మహేష్ ఫ్యాన్స్ ఎప్పుడు కోపంగా ఉంటారు. మహేష్ కి చాలా సార్లు కూడా ఫ్యాన్స్ ఇలా రివ్యూస్ ఇవ్వొద్దని రిక్వెస్ట్ చేశారు. ఇక అభిమానుల కోసం ఇలా మహేష్ రివ్యూలు ఆపేశాడేమో అన్న సందేహం కలుగుతుంది. ఏది ఏమైనా ఈ విషయంలో అభిమానులు హ్యాపీగానే ఉన్నారు.