మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ లగ్జరీ లైఫ్‌స్టైల్: వందల కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్లు, వాచీల కలెక్షన్ సినీ, రాజకీయ నేపథ్యమున్న నందమూరి కుటుంబం నుండి వచ్చినప్పటికీ, స్వయంకృషితో ఎదిగి గ్లోబల్ ఐకాన్‌గా మారారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (తారక్). నటన, నృత్యం, డైలాగ్ డెలివరీలో వన్ అండ్ ఓన్లీ వన్ అనిపించుకునే తారక్, లగ్జరీ లైఫ్‌స్టైల్ మెయింటైన్ చేయడంలోనూ అంతే ప్రత్యేకతను చాటుకుంటారు. ముఖ్యంగా ఖరీదైన కార్లు, బ్రాండెడ్ వాచీలంటే ఆయనకు అమితమైన ఇష్టం.
ఇటీవల విడుదలైన 'డ్రాగన్' గ్లింప్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ ఆస్తులు, లగ్జరీ కలెక్షన్స్ వివరాలు ఇవే. రూ. 500-600 కోట్ల నెట్ వర్త్పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఎన్టీఆర్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు రూ. 80 కోట్ల నుండి రూ. 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. వివిధ బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, పెట్టుబడులతో కలిపి ప్రస్తుతం ఆయన నికర ఆస్తి విలువ (నెట్ వర్త్) సుమారు రూ. 500 కోట్ల నుండి రూ. 600 కోట్ల వరకు ఉంటుందని అంచనా. హైదరాబాద్‌లోని ప్రముఖ జూబ్లీహిల్స్ ఏరియాలో రూ. 25 కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లు ఉంది. దీనితో పాటు శంకరపల్లిలో ఆరున్నర ఎకరాల సువిశాలమైన ఫామ్ హౌస్, ముంబై, బెంగళూరు నగరాల్లోనూ భారీ ప్రాపర్టీలు ఉన్నాయి.
గ్యారేజీలో అరుదైన లగ్జరీ కార్లుతారక్ గ్యారేజీలో ప్రస్తుతం అరడజనుకు పైగా అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు కొలువుదీరాయి. వాటిలో ముఖ్యమైనవి:పోర్స్ కేమన్ ఎస్: ఎన్టీఆర్ గ్యారేజీలో ఉన్న అత్యంత అరుదైన కారు ఇది. ప్రస్తుతం దీని తయారీ ఆగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 777 మోడల్స్ మాత్రమే అందుబాటులో ఉన్న ఈ కారును అప్పట్లోనే దాదాపు రూ. 3 కోట్లకు పైగా పెట్టి కొనుగోలు చేశారు. లాంబోర్గిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సుల్: భారతదేశంలోనే ఈ ప్రత్యేకమైన ఎడిషన్‌ను కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి ఎన్టీఆర్ కావడం విశేషం. దీని విలువ సుమారు రూ. 3.5 కోట్లు.
మెర్సిడెస్ మేబాచ్ ఎస్ క్లాస్: దీని మార్కెట్ ధర సుమారు రూ. 4 కోట్లు ఉంటుంది.ఇతర కార్లు: వీటితో పాటు రూ. 2.5 కోట్ల విలువైన రేంజ్ రోవర్ వోగ్, రూ. 1.70 కోట్ల ఖరీదైన బీఎండబ్ల్యూ 7 సిరీస్ ఉన్నాయి. అలాగే ఫ్యామిలీతో కలిసి ప్రయాణించేందుకు రూ. 1.53 కోట్ల టయోటా వెల్ ఫైర్ కారును వాడుతుంటారు.ప్రత్యేకమైన '9999' నంబర్ ప్లేట్తారక్ తన తాత నందమూరి తారకరామారావు, తండ్రి హరికృష్ణల సెంటిమెంట్‌ను పాటిస్తూ తన కార్లు అన్నింటికీ '9999' లేదా కూడిక '9' వచ్చేలా నంబర్ ప్లేట్లను ఎంచుకుంటారు. తన లాంబోర్గిని ఉరుస్ కారు ఫ్యాన్సీ నంబర్ కోసమే ఏకంగా రూ. 17 లక్షలు ఖర్చు చేయడం అప్పట్లో సంచలనమైంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి