టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత యశోద సినిమా తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం శాకుంతలం. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మహాభారతంలోని మొదటి ఘట్టం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కుతోంది. మహాశివరాత్రి సెలవు దినాలను ఆసరాగా చేసుకుని ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్ర బృందం. దీంతో ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటూనే... మరోపక్క సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు.


ఇందులో భాగంగానే జనవరి 9వ తేదీన సినిమా నుంచి ట్రైలర్ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. చివర్లో సింహంపై అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ భరతుని పాత్రలో కనిపించడం నిజంగా సినిమాకి హైలైట్ అని చెప్పవచ్చు. అంచనాలకు మించి ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో సినిమాపై అభిమానులలో మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఫిబ్రవరి 17వ తేదీ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాము అంటూ అభిమానుల సైతం సోషల్ మీడియా ద్వారా తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ రానుంది.

సమంత శాకుంతలం సినిమా నుండి మ్యూజికల్ ప్రమోషన్స్ని కూడా మొదలు పెట్టేశారు. ఈ సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ని కూడా ఫిక్స్ చేయడం జరిగింది.  శాకుంతలం మూవీ నుండి మల్లికా మల్లికా అనే పల్లవి తో సాగే మొదటి పాటను ఈరోజు అనగా జనవరి 18న రిలీజ్ చేయబోతున్నారు చిత్ర మేకర్స్. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్న అభిమానులకు ఈ మొదటి పాట ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో దుశ్యంతుడి పాత్రలో దేవ మోహన్ .. అనసూయ పాత్రలో అతిధి బాలన్,  మహర్షి పాత్రలో మోహన్ బాబు , ప్రిన్స్ భరత్ పాత్రలో అల్లు అర్హ కనిపించబోతున్నారు. గుణశేఖర్ సొంత బ్యానర్ గుణ టీం వర్క్స్ పతాకం పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: