ఏంటి ఆ మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీకి నిజంగానే గుడ్ బై చెప్పబోతున్నారా.. ఇంతకీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోవాలనుకుంటున్న ఆ మాజీ మంత్రి ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా తెలంగాణలో మున్సిపల్,కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగి ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ భారీ మెజారిటీ సాధించిన సంగతి మనకు తెలిసిందే.చాలా చోట్ల మేయర్లుగా,మున్సిపల్ చైర్మన్లుగా కాంగ్రెస్ పార్టీకే అధికారం దక్కింది. ఇదిలా ఉంటే జగిత్యాలలో చాలా రోజుల నుండి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా మెదులుతున్న ఎమ్మెల్యే సంజయ్ మీద మాజీ మంత్రి జీవన్ రెడ్డి మండిపడుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన సంజయ్ పార్టీ మారినట్టు బీఆర్ఎస్ పార్టీ ఆరోపించినప్పటికీ స్పీకర్ మాత్రం సంజయ్ పార్టీ మారలేదని,పార్టీ మారినట్టు ఎలాంటి ఆధారాలు లేవని కొట్టిపారేశారు. 

అయితే రీసెంట్గా మున్సిపల్ ఎలక్షన్స్ జరిగిన సమయంలో కాంగ్రెస్ పార్టీ సంజయ్ వర్గానికి చెందిన వారికే పార్టీ నుండి టికెట్లు కేటాయించడంతో జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేసి కాంగ్రెస్ పార్టీ నుండి తన అనుచరులను రెబల్స్ గా పోటీకి దించారు. కానీ ఇక్కడ సంజయ్ తరపున నిలబడిన వాళ్లు కాకుండా జీవన్ రెడ్డి అనుచరులు విజయం సాధించారు. అయితే తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్లో ఇంకా ఎన్ని రోజులు ఈ అవమానాలు భరిస్తూ ఉండాలి.. కాంగ్రెస్లో కొనసాగడంపై ఆలోచనలు చేస్తున్నాను. భవిష్యత్తు ఎలా ఉంటుందో గోచరించడం లేదు..

 జగిత్యాల లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కి పట్టా రాసిచ్చిందా.. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం నాకు ఈ అవమానాలు తప్పవు.. స్పీకర్ సంజయ్ పార్టీ మారలేదు అని అంటున్నాడు.కానీ సంజయ్ మాత్రం తన సంసారం మొత్తం కాంగ్రెస్తోనే చేస్తున్నాడు. జగిత్యాల లోనే ఇలా ఉంటే పార్టీ మారిన ఇంకా 9 ప్రాంతాలలో పరిస్థితి ఎలా ఉందో... కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను మొదట గౌరవించాలి. అంటూ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై అసహనం వ్యక్తం చేశారు.ఏది ఏమైనప్పటికీ జీవన్ రెడ్డి మాటలు చూస్తూ ఉంటే ఆయన పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: