తమిళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ తాజాగా వారిసు అనే మూవీ లో హీరోగా నటించాడు. వంశీ పైడిపల్లి ఈ మూ వీకి దర్శకత్వం వహించగా , దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా , తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని జనవరి 11 వ తేదీన తమిళ్ లో విడుదల చేయగా , జనవరి 14 వ తేదీన వారసుడు అనే టైటిల్ తో తెలుగులో విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు వర్షన్ ఇప్పటికే వారం రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ వారం రోజుల్లో ఈ సినిమా రోజు వారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ కలెక్షన్ లను సాధించిందో తెలుసుకుందాం.

మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.10 కోట్ల కలెక్షన్లను వసులు చేయగా ,  రెండవ రోజు 2.94 కోట్ల కనెక్షన్ లను వసూలు చేసింది. మూడవ రోజు ఈ సినిమా 2.69 కోట్ల కలెక్షన్లను వసూలు చేయగా ,  నాలుగో రోజు 2.17 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఐదవ రోజు ఈ సినిమా 1.30 కోట్ల కలెక్షన్లను వసూలు చేయగా  ఆరవ రోజు 0.63 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఏడవ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 0.24  కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తం మీద ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 13.07 కోట్ల షేర్ , 23.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది. ప్రస్తుతం కూడా వారసుడు మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అనే రేంజ్ కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తమిళ్ వర్షన్ కు మాత్రం ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో శ్రీకాంత్ ,  విజయ్ కి తమ్ముడు పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: