

తాజాగా హీరోయిన్ రాశి ఖన్నా కూడా సరికొత్త గెటప్ తో కనిపించడంతో ఈమె పైన బాగా ట్రోల్ చేస్తున్నారు నేటిజన్స్. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే మంచి క్రేజీ సంపాదించుకుంది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించింది. ఖాళీగా ఉన్న సమయంలో సోషల్ మీడియాలో తరచూ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

మొదటిసారి సినీ ఇండస్ట్రీకి బాలీవుడ్ ద్వారా పరిచయమైన రాశి ఖన్నా ఆ తర్వాత తెలుగులో అతిథి గా తెలుగు పరిశ్రమలో కూడా అడుగు పెట్టింది. మనం సినిమాలో మొదటిసారి అతిథి పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత హీరోయిన్గా పలు చిత్రాలలో నటించింది.
