బుల్లితెర యాంకర్లకు ఈమధ్య ఓ రేంజ్ లో సినిమా ఆఫర్లు వస్తున్నాయి. సుమ లాగా నేను సినిమాల్లో చేయను కేవలం స్మాల్ స్క్రీన్ యాంకర్ గానే ఉంటానని అనుకునే వారు ఎవరు ఉండరు. అనసూయ నుంచి శ్రీముఖి వరకు యాంకరింగ్ చేస్తూనే మంచి పాత్ర వస్తే చేయడానికి రెడీగా ఉంటారు. అనసూయ ఇప్పటికే స్మాల్ స్క్రీన్ షోస్ ని వదులుకుని సినిమాలు చేస్తుంది. రంగస్థలం, పుష్ప లాంటి సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది అంటే యాక్టింగ్ మీద అనసూయ ఎంత సీరియస్ గా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇదే దారిలో ఇప్పుడు శ్రీముఖి కూడా వెళ్లాలని చూస్తుంది.

ముందు హీరోయిన్ గానే ట్రై చేసిన శ్రీముఖి అక్కడ కష్టమని బుల్లితెరకు షిఫ్ట్ అయ్యింది. పటాస్ షోతో పాపులారిటీ తెచ్చుకుని టాప్ యాంకర్స్ లో ఒకరిగా క్రేజ్ తెచ్చుకుంది. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తున్న శ్రీముఖి లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఒక మంచి పాత్రలో కనిపిస్తుందని టాక్. చిరు భోళా శంకర్ సినిమాలో ఖుషి సీన్ రీ క్రియేట్ చేస్తారట. అందులో భూమికగా శ్రీముఖి పవన్ కళ్యాణ్ గా చిరు కనిపిస్తారట. చిరు పవన్ కళ్యాణ్ లా నటించడం ఫ్యాన్స్ కి పండుగే అని చెప్పొచ్చు.

ఇదే కాకుండా అనీల్ రావిపుడి బాలయ్య కాంబోలో వస్తున్న సినిమాలో శ్రీముఖి ఛాన్స్ అందుకుందని టాక్. శ్రీముఖి చేసే ఈ పాత్ర ఏంటన్నది తెలియదు కానీ ఎన్.బి.కె 108లో కూడా శ్రీముఖి ఉంటుందని చెబుతున్నారు. సో ఒకేసారి చిరు, బాలయ్య సినిమాల్లో శ్రీముఖి ఛాన్స్ అందుకోవడం లక్కీ అని చెప్పొచ్చు. అయితే తను సినిమాలు చేసినా స్మాల్ స్క్రీన్ మాత్రం వదిలి పెట్టేది లేదని అంటుంది శ్రీముఖి. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ కాబట్టి శ్రీముఖి అక్కడ ఇక్కడ అదరగొట్టాలని ఫిక్స్ అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: