ప్రస్థుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘పుష్ప 2’ కు సంబంధించి ఒక ఆసక్తికర న్యూస్ ఇప్పుడు లీక్ అయింది. ఈమూవీని రియల్ ఫారెస్ట్ ఏరియాలలో కాకుండా ఎక్కువగా అరణ్యాలను అల్లు స్టూడియోలో క్రియేట్ చేసి ఆతరువాత కొన్ని సన్నివేశాలను మాత్రమే ఈసినిమాకు సంబంధించి బ్యాంకాక్ అడవులలో కానీ లేదంటే సౌత్ఆఫ్రికా అడవులలో కానీ చిత్రీకరించాలని సుకుమార్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు అంటూ ఇండస్ట్రీ నుండి వార్తలు లీక్ అవుతున్నాయి.

మొదట్లో సుకుమార్ ఈసీక్వెల్ కు సంబంధించి సహజత్వం కోసం బ్యాంకాక్ అడవులలోకి వెళ్లాలని మాష్టర్ స్కెచ్ వేసినప్పటికీ ఈస్కెచ్ కి సౌత్ఆఫ్రికా బ్యాంకాక్ ప్రభుత్వాల నుండి పూర్తి పర్మిషన్ రాలేదు అని అంటున్నారు. దీనికితోడు సినిమాల షూటింగ్ కు సంబంధించి పర్మిషన్స్ ఇవ్వడంలో బ్యాంకాక్ సౌత్ఆఫ్రికా ప్రభుత్వాలు వేగంగా స్పందించకపోవడంతో ఈనిర్ణయం తీసుకున్నారు అన్నకామెంట్స్ కూడ వస్తున్నాయి.

వాస్తవానికి ‘పుష్ప 2’ పై పెడుతున్న బడ్జెట్ మరీ భారీస్థాయిలో ఉండటంతో ఇప్పటి పరిస్థితులలో సుకుమార్ తన వ్యూహాలు మార్చుకుని ఇలా అల్లు స్టూడియోస్ లో సుమారు  11  సెట్స్ వేయించి ఆసెట్ చూసిన వారికి నిజంగానే ఒక ఫారెస్ట్ ను చూసినంత భావన కలిగే విధంగా సుకుమార్ తన యాక్షన్ ప్లాన్ ను మార్చుకున్నాడు అని అంటారు. గతంలో ‘పుష్ప’ షూటింగ్ కోసం మారేడుమిల్లి వెళ్ళి అక్కడ రియల్ ఫారెస్ట్ ఏరియాలో షూట్ చేసినప్పటికీ సుకుమార్ కు ఈమూవీ షూటింగ్ ను అప్పట్లో చిత్రీకరిస్తున్న సమయంలో డీప్ ఫారెస్ట్ లోని ప్రాంతాలను పోలినవిధంగా అల్లు అర్జున్ అంగీకారం తీసుకుని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ ఏరియాను సుకుమార్ చాల తెలివిగా సెట్స్ వేయించినట్లు తెలుస్తోంది.

గతంలో ‘పుష్ప’ కోసం మారేడుమిల్లి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ షూటింగ్ సమయంలో రాత్రి సమయంలో రాక్షసి దోమలు సుకుమార్ బన్నీ లను ఇబ్బంది పెట్టడంతో ఇప్పుడు అలాంటి సమస్యలు ఏమీ లేకుండా ముందు చూపుతో ఆర్టిఫిషియల్ అరణ్యాలను సృష్టించి తనకు కానీ బన్నీకి కానీ అదేవిధంగా ఈమూవీలో నటిస్తున్న నటీనటులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా సుకుమార్ ఈ వ్యూహాలను ఎంచుకున్నాడు అన్నమాటలు వినిపిస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: