యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొంత కాలం క్రితం వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగిన ఎన్టీఆర్ పోయిన సంవత్సరం విడుదల ఆయన ఆర్ ఆర్ ఆర్ అనే పాన్ ఇండియా మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఎన్టీఆర్ తన తదుపరి మూవీ లను కూడా అదే రేంజ్ లో విడుదల చేయడానికి ప్రస్తుతం ప్లాన్స్ చేస్తున్నాడు.

అందులో భాగంగా ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ ని పాన్ ఇండియా స్థాయికి మించి విడుదల చేయడానికి ఈ మూవీ బృందం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఈ మూవీ దర్శకుడు కొరటాల శివ కూడా ఈ మూవీ కథను భారీ స్థాయి ఉన్న కథగా రూపొందించినట్లు తెలుస్తుంది. ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించనున్నాడు.

 ఇది ఇలా ఉంటే ఈ మూవీ ముహూర్తం ను ఈ నెల 23 వ తేదీన చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ముహూర్తం కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ ఓపెనింగ్ ను అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించాలా లేక నోవేటల్ లో నిర్వహించాల అనే విషయంలో ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం డిస్కషన్ లని కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ యూనిట్ ఈ మూవీ ఓపెనింగ్ ను ఎక్కడ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: