టాలీవుడ్ కింగ్ అక్కి నేని నాగార్జున గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగర్జున ఇప్పటికే ఎన్నో మంచి మంచి విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించి ఇప్పటికీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజి యేస్ట్ సీనియర్ స్టార్ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు . ఇది ఇలా ఉంటే నాగార్జున కొంత కాలం క్రితం ది ఘోస్ట్ అనే మూవీ లో హీరో గా నటించాడు .

 ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో సోనాల్ చౌహాన్ ... నాగార్జున సరసన హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ పోయిన సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పరవాలేదు అని రేంజ్ లో అలరించింది. ఇది ఇలా ఉంటే నాగార్జున "ది ఘోస్ట్" మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న తన తదుపరి మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన చేయలేదు.

కొన్ని రోజుల క్రితం నాగార్జున తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి కథ రచయితడిగా పేరు తెచ్చుకున్న బెజవాడ ప్రసన్న కుమార్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ కొన్ని అని వార్య కారణాల వల్ల ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలబడలేదు. కానీ వీరిద్దరి కాంబినేషన్ లో ఫైనల్ గా మూవీ ఓకే అయినట్లు తెలుస్తుంది. అలాగే ఉగాది కి దగ్గరలో వీరికి సంబంధించిన సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఉండబోతున్నట్లు సమాచారం. బెజవాడ ప్రసన్నకుమార్ తాజాగా రవితేజ హీరోగా రూపొందిన ధమాకా మూవీ కి కథను అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: