ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఈరోజు నుంచే రెగ్యులర్గా షూటింగ్ మొదలు కాబోతున్నది. ఈ సినిమా పైన పలు అనేక ఊహ కథనాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎన్టీఆర్ ఇందులో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. హైదరాబాద్, గోవా వంటి నగరాలలో స్పెషల్ సెట్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.NTR -30 లో ప్రతి పోస్టర్లో కూడా సముద్రం హైలైట్ గా నిలుస్తోంది.
ఆస్కార్ ఈవెంట్ అయిపోయిన వెంటనే ఎన్టీఆర్ దాస్క ధమ్కీ ఆడియో ఫంక్షన్ లో కనిపించి అక్కడ మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన 30వ సినిమాకు సంబంధించి పలు విషయాలను కూడా అభిమానులతో పంచుకోవడం జరిగింది. పూజా కార్యక్రమాలను ఈనెల 18వ తేదీన చాలా గ్రాండ్గా నిర్వహించారు. ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ ఈ రోజున మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేయబోతున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా యాక్షన్ సినిమా అన్నట్టుగా ఎక్కువగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సంగీతాన్ని అనురుధ్ అందించబోతున్నట్లు తెలుస్తోంది. యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.