ప్రస్థుతం రష్మిక పూజా హెగ్డేల కంటే ఎక్కువ మ్యానియా శ్రీలీల పైనే ఉంది. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలు కేవలం రెండు మాత్రమే విడుదల అయినప్పటికీ ఆమెకు ఇండస్ట్రీ వర్గాలు ఇస్తున్న అవకాశాలు అదేవిధంగా ఆమెకు వస్తున్న బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ పరిశీలించిన వారికి ఎవరికైనా మైండ్ బ్లాక్ అవుతుంది. ఈమధ్య కాలంలో చాలామంది ఫిలిం సెలెబ్రెటీలకు వైద్యానికి కూడ లొంగని కొన్ని అరుదైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.


వాటితో పోరాటం చేస్తూనే చాలామంది ఫిలిం సెలెబ్రెటీలు తమ కెరియర్ ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం యూత్ కు క్రేజీ స్టార్ గా మారిన శ్రీలీల కు ఒక అరుదైన అనారోగ్య సమస్య ఉందట. ఆమెకు తెల్లవారగానే వరసపెట్టి తుమ్ములు వస్తాయట. ఒకొక్కసారి అలా వచ్చే తుమ్ముల సంఖ్య 30 వరకు ఉంటాయట. మరీ ముఖ్యంగా ఆ క్రితంరోజు రాత్రి శ్రీలీల తినే ఆహారంలో లేదా చల్లని వాతావరణంలో ఏమైనా ఎక్కువ మార్పులు కనిపిస్తే ఈ తుమ్ములు మరింత ఎక్కువట.

ఈ అనారోగ్యం గురించి ఆమె పెద్దగా పట్టించుకోపోయినా దీనికి ఆమెకు ఇప్పటివరకు పరిష్కారం దొరకలేదట. ఇలాంటి సమస్యలు ఎలర్జీ వల్ల ఏర్పడుతాయని అందువల్ల ఎలర్జీ సమస్యలు లేకుండా చూసుకోమని డాక్టర్లు శ్రీలీల కు సలహా ఇస్తూ ఉంటారట. మెడిసెన్ చదువుతున్న శ్రీలీల సినిమాల పై మోజుతో ప్రస్తుతం చదువును పక్కకు పెట్టి సినిమాలలో బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే.


అయితే తాను డాక్టర్ కోర్స్ ను పూర్తి చేయడం ఖాయం అని శ్రీలీల తరుచు ఇంటర్వ్యూలలో చెపుతూ ఉంటుంది. వరసపెట్టి ఆమెకు వస్తున్న అవకాశాల లిస్టు చూస్తుంటే శ్రీలీల డాక్టర్ గా మారడం ఇప్పట్లో సాద్యం కాదు అన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ కు కూతురుగా నటిస్తున్న శ్రీలీల టాప్ యంగ్ హీరోలు జూనియర్ చరణ్ ప్రభాస్ బన్నీ మహేష్ లతో కలిసి నటించాలని గట్టి ప్రయత్నాలలో ఉంది అనుకోవాలి..
మరింత సమాచారం తెలుసుకోండి: