బ్లాక్ బస్టర్ బలగం : ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

స్వచ్ఛమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చూపిస్తూ తెరకెక్కించిన సినిమా బలగం. జబర్దస్త్‌ కమెడియన్‌ టాలీవుడ్ యాక్టర్ వేణు డైరెక్టర్‌గా ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు.ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌ రామ్‌ ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు సమర్పణలో ఆయన కూతురు హన్షిత ఇంకా హర్షిత్‌రెడ్డి బలగం సినిమాను తెరకెక్కించారు. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. వేణు డైరెక్షన్ మొదటిసారిగా చేసినా చాలా అద్భుతంగా సినిమాను తెరకెక్కించాడంటూ మెగాస్టార్‌ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దైనందిన జీవితాల్లో మాయమైపోతున్న కుటుంబ బంధాలను వేణు చాలా చక్కగా చూపించారు ఈ సినిమాలో. చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన వారం రోజుల్లోనే లాభాల బాట పట్టింది. ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తోన్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం అందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


ఈ క్రమంలో బలగం సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ గురించి సోషల్‌ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఈ మూవీని ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.బలగం స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అన్నీ కుదిరితే ఏప్రిల్‌ మొదటివారం (ఏప్రిల్ 2)లో ఈ మూవీని స్ట్రీమింగ్‌కి తీసుకురానున్నట్లు సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇంకా దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి భీమ్స్‌ సిసిరోలియో అందించిన స్వరాలు చార్ట్‌ బస్టర్‌గా నిలిచాయి. అలాగే కాసర్ల శ్యాం అందించిన సాహిత్యం ఇంకా మంగ్లీ పాట పాట బలగం సినిమాకు హైలెట్‌గా నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: