లైగర్ సినిమా బారీ డిజాస్టర్ కావడంతో విజయ్ దేవరకొండ ఎలాగైనా హిట్టు కొట్టాలని పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక శివానిర్మాణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతున్నది.ఇందులో హీరోయిన్గా సమంత నటిస్తున్నది. ఈ సినిమా మీద అటు విజయ్ దేవరకొండ అభిమానులు, సమంతా అభిమానులు డైరెక్టర్ శివ కూడా ఈ సినిమా పైన పలు ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.సమంతకు ఫ్యామిలీ మ్యాన్ హీట్ తర్వాత సరైన సక్సెస్ అందుకోలేకపోతోంది. అలాగే యశోద సినిమా బాగానే ఉన్న కలెక్షన్ల పరంగా ఆకట్టుకోలేకపోయింది.మరి నేపథ్యంలోని ఖుషి సినిమా మీద విజయ్ దేవరకొండ అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయబోతున్నారు. కాశ్మీర్ నేపథ్యంలో సాగుతున్న ఒక అద్భుతమైన ప్రేమ కథ అని ముందుగానే పలు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అలాంటిది ఏమీ లేదంటూ చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఎట్టకేలకు ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేసింది చిత్ర బృందం.

ఏమిటంటే ఒక పోస్టర్ను విడుదల చేస్తూ ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తారీఖున విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.విజయ్ దేవరకొండ ,శివానిర్మాణ మైత్రి మూవీస్ బ్యానర్ లో వస్తున్న సినిమా అంటూ సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ సెప్టెంబర్ ఒకటవ తారీఖున వచ్చేస్తున్నామని తెలియజేశారు.. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ సినిమాకి మలయాళంలో హృదయం సినిమాకి మ్యూజిక్ అందించిన హేశం అబ్దుల్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ అభిమానులు అయితే ఈ ప్రకటనతో చాలా సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం సమంత పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో బిజీగా ఉంటోంది. మరి విజయ్ దేవరకొండ ఈసారైనా ఈ సినిమాతో సరైన సక్సెస్ ని అందుకుంటారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: