టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్నది హీరోయిన్ సమంత. తాజాగా ఈమె డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 14వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్నది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టారు చిత్ర బృందం. సమంత ఈ సమయంలోనే వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తోంది.ఇంటర్వ్యూ సందర్భంగా సమంతసినిమా గురించి ఎన్నో విషయాలను తెలియజేయడం జరిగింది. శాకుంతలం సినిమాలో కుమారుడు భరతుడి పాత్రలో అల్లు వారసురాలు అల్లు అర్హ నటించిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలోనే సుమ అల్లు అర్హ గురించి పలు ప్రశ్నలు అడగడం జరిగింది సమంతతో.. ఇక అర్హ గురించి సమంత మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేయడం జరిగింది. ఆర్హ సెట్లో తెలుగులో మాట్లాడుతూ ఉంటే చాలా క్యూట్ గా ఉందని సమంత తెలియజేయడం జరిగింది. ఈ చిత్రంలో ఆర్హకు తెలుగులో పెద్ద పెద్ద డైలాగులు ఉన్నాయని తెలియజేయడం జరిగింది.


తన చుట్టూ వంద మంది ఉన్న ఆమె ఏ మాత్రం భయపడకుండా ఆ డైలాగులతో ఎంతో అద్భుతంగా చెప్పిందని తెలిపింది సమంత.. సమంత ఇలా చెప్పడం వెంటనే సుమ అర్హ ఎవరి కూతురు తగ్గేదే లేదు ఇక్కడ అంటూ చెప్పగా సమంత కూడా తగ్గేదేలే అంటూ కామెంట్స్ చేయడం జరిగింది. ప్రస్తుత కాలంలో ఇంగ్లీష్ ఎలాగైనా వస్తుంది కానీ తెలుగు నేర్చుకోవడం చాలా కష్టమైన పని అని తెలియజేసింది సమంత. కానీ అర్హకు మాత్రం తెలుగు ఎంతో అద్భుతంగా నేర్పించారని ఈ విషయంలో బన్నీకి స్నేహ రెడ్డికి హ్యాండ్సప్ చెప్పచ్చు అంటూ సమంత తెలియజేయడం జరిగింది. ఇంత చిన్న వయసులోని అర్హ ఎంతో అద్భుతంగా నటించిందని సమంత తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: