మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి ... ఆ తర్వాత ఎన్నో సినిమా లలో చిన్న చిన్న పాత్రల్లో నటించి అలాగే ఎన్నో సినిమా లలో విలన్ పాత్రలో నటించి తన నటన తో ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకొని ఆ తర్వాత హీరోగా సినిమాల్లో అవకాశాలను దక్కించుకున్నాడు.

 అలా సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకున్న రవితేజ తాను నటించిన సినిమాలలో అద్భుతమైన నటనను కనబరచడం మాత్రమే కాకుండా ... తాను నటించిన సినిమాలతో మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇలా కెరియర్ లో ఇప్పటికే ఎన్నో విజయాలను అందుకున్న రవితేజ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకొని ఫుల్ జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా రవితేజ "రావణాసుర" అనే మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ ఏప్రిల్ 7 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్ లలో భాగంగా రవితేజ ... నచురల్ స్టార్ నాని తో ఒక ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా రవితేజ మాట్లాడుతూ ... సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రారంభంలో తాను ఎదుర్కొన్న కష్టాలను రవితేజ తాజాగా వివరించారు. అయితే తన కెరీర్‌ లో తాను ఎప్పుడూ నిరాశ చెందలేదని రవితేజ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. రవితేజ హీరోగా రూపొందిన రావణాసుర మూవీ కి సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా ... సుశాంత్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: