ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో నటించి ఎంతో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న జాన్వీ కపూర్ మరి కొన్ని రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తోనే ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయి కి మించి  9 భాషలలో విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని చిత్ర బృందం పూజా కార్యక్రమాలతో అధికారికంగా లాంచింగ్ చేసింది. ఈ కార్యక్రమానికి జాన్వి కపూర్ కూడా విచ్చేసింది. ఇది ఇలా ఉంటే ఈ భారీ క్రేజ్ ఉన్న సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ ముద్దు గుమ్మ మరో అద్భుతమైన క్రేజ్ ఉన్న మరో తెలుగు సినిమాలో కూడా అవకాశాన్ని దక్కించుకుంది అంటూ ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

 అసలు విషయం లోకి వెళితే ... సూపర్ స్టార్ మహేష్ బాబు ... దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఒక భారీ బడ్జెట్ మూవీ రూపొందబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన లాంచింగ్ కార్యక్రమాలు మరి కొన్ని రోజుల్లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో మహేష్ సరసన జాన్వి కపూర్ ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: