రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు తెలుగురాష్ట్రాలలో అత్యంత ఘనంగా జరిగాయి. అందరూ ఊహించినట్లుగానే అతడి పుట్టినరోజున శంకర్ దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న మూవీ టైటిల్ పోష్టర్ విడుదల చేసారు. ఈమూవీ టైటిల్ ‘గేమ్ చేంజర్’ అంటూ ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ఆటైటిల్ పోష్టర్ ట్రెండింగ్ గా మారింది.


అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈమూవీ పాన్ ఇండియా మూవీగా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదలకాబోతోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తరువాత చరణ్ చిరంజీవితో కలిసి నటించిన ‘ఆచార్య’ నిరాశపరచడంతో చరణ్ ష్టామినాకు ఈ ‘గేమ్ చేంజర్’ గట్టి పరీక్ష పెట్టబోతోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో చరణ్ ను అల్లూరి సీతారామరాజు పాత్రలో కనపరచిన నటనకు హాలీవుడ్ క్రిటిక్స్ ప్రశంసలు కూడ లభించడంతో చరణ్ అభిమానులు రెట్టించిన ఉత్సాహంతో చరణ్ ను గ్లోబల్ స్టార్ అంటూ ఒక ట్యాగ్ ను క్రియేట్ చేసారు.


సోషల్ మీడియాలో చరణ్ కు సంబంధించిన ఏదైనా వార్తలు అభిమానులు ప్రచారంలోకి తీసుకు రావాలి అంటే చరణ్ పేరుకు ముందు గ్లోబల్ స్టార్ అన్న ట్యాగ్ తో ప్రచారం చేస్తూ వచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘గేమ్ చేంజర్’ టైటిల్ పోష్టర్ లో ఈమూవీ నిర్మాత దిల్ రాజ్ చరణ్ పేరుకు ముందు ‘గ్లోబల్ స్టార్’ అన్న ట్యాగ్ ను పెడతాను అని చెప్పాడట.అయితే చరణ్ ఈట్యాగ్ పై పెద్దగా ఆశక్తి కనపరచకుండా ఎప్పటిలానే ‘మెగా పవర్ స్టార్’ అన్న ట్యాగ్ ను పోష్టర్ లో వేయమని చెప్పాడట. అంతేకాదు తనకు సంబంధించి మరో రెండు భారీ సినిమాలకు హాలీవుడ్ స్థాయిలో పేరు వచ్చే వరకు తన పేరు ముందు ‘గ్లోబల్ స్టార్’ అన్న ట్యాగ్ కొంచం అసందర్భంగా ఉంటుంది అని చరణ్ వ్యక్తిగతంగా ఫీల్ అవ్వడంతో ఎప్పటిలానే ‘గేమ్ చేంజర్’ టైటిల్ పోష్టర్ లో చరణ్ పేరు ముందు మెగా పవర్ స్టార్ అని ఎప్పటిలానే వేసారు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి..
మరింత సమాచారం తెలుసుకోండి: