ప్రతి సంవత్సరం మీడియం రేంజ్ హీరోలు నటించిన సినిమాలు ఎన్నో థియేటర్ లలో విడుదల అవుతూ వస్తున్నాయి. అందులో కొన్ని సినిమాలు అద్భుతమైన అంచనాలతో థియేటర్ లతో విడుదల అవుతూ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న మీడియం రేంజ్ హీరోలు నటించిన సినిమాలలో మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ కలక్షన్ లను వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న విజయ్ దేవరకొండ తాజాగా లైగర్ అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.57 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి మొదటి స్థానంలో ఉంది. యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరో గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈస్మార్ట్ శంకర్ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.73 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

అక్కినేని అఖిల్ ... వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ మూవీ తో హీరో గా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.60 కోట్ల షేర్ కలక్షన్ లను చేసింది. నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన "ఎంసీఏ" మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 7.57 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన డియర్ కామ్రేడ్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 7.50 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: