తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో తరుణ్ భాస్కర్ ఒకరు. ఈ దర్శకుడు విజయ్ దేవరకొండ హీరోగా రీతు వర్మ హీరోయిన్ గా రూపొందిన పెళ్లి చూపులు మూవీ తో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టి ఈ మూవీ తోనే ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకొని దర్శకుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు.

ఇది ఇలా ఉంటే పెళ్లి చూపులు లాంటి సూపర్ సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత తరుణ్ భాస్కర్ "ఈ నగరానికి ఏమైంది"  అనే యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మించాడు. ఈ మూవీలో విశ్వక్ సేన్ , సుశాంత్ రెడ్డి , అభినవ గోమతం , వెంకటేష్ కాకమాను , అనీషా ఆంబ్రోస్ ,
సిమ్రాన్ చౌదరి ముఖ్య పాత్రలలో నటించారు.


మూవీ ని 29 జూన్ 2018 వ సంవత్సరం విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఎంత గానో అలరించి అద్భుతమైన విజయం అందుకుంది. ఇలా ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ మూవీ ని మళ్లీ థియేటర్ లలో రీ రిలీస్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ని ఈ సంవత్సరం మే నెలలో థియేటర్ లలో మళ్లీ రి రిలీస్ చేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు ... అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రానున్నట్లు ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: