తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ క్రేజ్ ఉన్న వారిలో అజిత్ కుమార్ ఒకరు. ఈ హీరో ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి తమిళ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే అజిత్ ఇప్పటి వరకు నేరుగా ఒక్క తెలుగు మూవీ లో కూడా నటించక పోయినప్పటికీ ఈ హీరో తాను నటించిన తమిళ మూవీ ల ద్వారానే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఈ మధ్య కాలంలో అజిత్ తాను నటించిన దాదాపు ప్రతి సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నాడు. అందులో భాగంగా కొన్ని సినిమాలు కూడా మంచి విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే అజిత్ ఆఖరుగా తూనీవు అనే తమిళ మూవీ లో హీరో గా నటించాడు. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని బోని కపూర్ నిర్మించాడు. ఈ మూవీ ని తెలుగు లో తెగింపు పేరుతో విడుదల చేశారు.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇలా తునీవు మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న అజిత్ ఇప్పటి వరకు తన తదుపరి మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. తాజాగా అజిత్ తదుపరి మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయం లోకి వెళితే ... అజిత్ తన కెరీర్ లో 62 వ మూవీ కి సంబంధించిన అనౌన్స్మెంట్ ఏప్రిల్ 14 వ తేదీన రానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: