తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య "కస్టడీ" అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... యువన్ శంకర్ రాజా ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. అరవింద స్వామి ... ప్రియమణిమూవీ లో ముఖ్యమైన పాత్రలలో కనిపించనుండగా ... ప్రతి శెట్టి ఈ మూవీ లో నాగ చైతన్య సరసన హీరోయిన్ గా కనిపించబోతుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఈ సంవత్సరం మే 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయినట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా నాగ చైతన్య ప్రారంభించినట్లు అప్పట్లో చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో నాగ చైతన్య కు సంబంధించిన కొంత ప్యాచ్ వర్క్ ను ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్యాచ్ వర్క్ కంప్లీట్ అయినట్లు అయితే ఈ సినిమాకు సంబంధించిన పనులు అన్ని పూర్తి అయినట్లే అని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకే రోజు విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: