రజనీ కాంత్ కూతురు ఐశ్వర్య ... ధనుష్ హీరో గా రూపొందినటువంటి "3" మూవీ తో మొట్ట మొదటి సారి మెగా ఫోన్ పట్టింది. మొదటి సారి దర్శకత్వం వహించినప్పటికీ "3" మూవీ తో ఐశ్వర్య దర్శకురాలిగా అద్భుతమైన ప్రశంసలను అందుకుంది. ఆ తర్వాత పలు మూవీ లకు దర్శకత్వం వహించిన ఐశ్వర్య ప్రస్తుతం "లాల్ సలాం" అనే సినిమాకు దర్శకత్వం వహిస్తుంది. విష్ణు విశాల్ మరియు విక్రాంత్ లు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ సినిమాను ఐశ్వర్య స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథతో రూపొందిస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీ కాంత్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులు గా వార్తలు బయటకు వస్తున్న అందరికీ తెలిసిందే. అలాగే చాలా రోజుల క్రితమే ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ కూడా అధికారికం గా ధృవీకరించింది. తాజాగా లాల్ సలాం మూవీ యూనిట్ ఈ సినిమా నుండి సూపర్ స్టార్ రజనీ కాంత్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది.

అలాగే ఈ సినిమాలో రజనీ కాంత్ ఏ పాత్రలో కనిపించబోతున్నాడో కూడా తెలియజేసింది. లాల్ సలాం మూవీ లో రజనీ కాంత్ "మోద్దీన్ బాయ్" పాత్రలో కనిపించబోతున్నట్లు ఈ చిత్ర బంధం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన పోస్టర్ లో వెనకాల గొడవలు జరుగుతూ ఉంటే అందులో నుండి అగ్గి మంటలు వస్తున్న సమయంలో రజిని స్టైలిష్ లుక్ లో నడుచుకుంటూ వస్తున్న పోస్టర్ ను ఈ మూవీ బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ కు ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది.

v

మరింత సమాచారం తెలుసుకోండి: