బిగ్ బాస్ అనే రియాలిటీ షో తో ఎంతో మంది పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు అవకాశాలు లేని చాలా వినికి బిగ్బాస్ షో ఒక మంచి వేదికగా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా బిగ్ బాస్ షో ద్వారా మంచి పేరు సంపాదించుకున్న సోహెల్ హీరోగా మారాడు .బిగ్ బాస్ 4  లో తనదైన ఆటతో అందరినీ ఆకట్టుకున్నారు సోహెల్. ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్బాస్ సీజన్ 6 లోకి ఎంట్రీ ఇచ్చింది ఇనయ సుల్తానా. ఈ షో తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది.తాజాగా సోహెల్ కోసం ఇనాయా సుల్తానా ఊహించని పనిచేస్తుందంటూ వార్తలు వినబడుతున్నాయి. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 4న ప్రారంభమైన బిగ్బాస్ తెలుగు ఆరవ సీజన్లోకి మొత్తం 21 మంది వచ్చారు. 

అందులో ఇనాయ సుల్తానా కూడా ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన ఈమె సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ద్వారా ఫేమస్ అయ్యింది. ఆయన బర్త్డే పార్టీకి వెళ్లిన ఈమె వర్మ తో కలిసి డాన్స్ చేసింది. దీంతో ఈ అమ్మాయి ఎవరో అని ఆరా తీస్తే ఇనాయా సుల్తానా గురించి తెలిసింది. ఇక వర్మ తో కలిసి చిందులు వేయకముందు ఈమె పలు సినిమాల్లో నటించింది.ఆ సినిమాలేవి ఈమెకి పెద్దగా గుర్తింపును తీసుకురాలేదు. కానీ ఆర్జీవి తో చిందులు వేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. దీంతో ఈమెకి బిగ్ బాస్ లోకి వెళ్లే అవకాశం వచ్చింది. అందరితో గొడవలు పెట్టుకుంటూ ఊహించిన విధంగా 14వ వారమే ఎలిమినేట్ అయిపోయింది.

అనంతరం బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వచ్చి సోహెల్ కు ప్రపోజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది . ఇదిలా ఉంటే ప్రస్తుతం సో హెల్ ఇనాయ ఇద్దరు కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా బూట్ కట్ బాలరాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సోహెల్. అయితే ఇటీవల ఈ సినిమా నుండి బాలరాజు రాజు బంగారి రాజు అనే ఒక పాట విడుదలైంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తాజాగా ఈ పాటకు స్టెప్పులేస్తూ కనిపించింది బ్లూ కలర్ జాకెట్ బ్లాక్ సారీ కట్టుకొని సిగ్గుపడుతూ ఈ పాటపై డాన్స్ చేసింది. దీంతో ఈ వీడియో చూసిన వారందరూ సోహెల్ కోసమే ఇలా చేశావు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: