తెలుగు సినీ ఇండస్ట్రీలో జతకలిసే, రాజు గారి గది వంటి సిరీస్లలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు.. హీరోగా ప్రస్తుతం హిడింబ అనే సినిమాలో నటిస్తున్నారు.. ఈ చిత్రం అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు.. ఈ సినిమా ట్రైలర్ను తాజాగా నటుడు సాయిధరమ్ తేజ్ విడుదల చేయడం జరిగింది.ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచే ఈ సినిమా యాక్షన్ బ్యాక్ కథ అన్నట్లుగా వార్తలు వినిపించాయి. అలాగే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఈ టీజర్లో చూపించారు.


ఇక ట్రైలర్ చూసి ప్రేక్షకులు సైతం ఈ సినిమా అంచనాలను పెంచేస్తూ ఉన్నారు..1908 లో బ్రిటిష్ కాలంలో నరమాంసభక్షకులు ఉండే ఒక దీపానికి ఖైదీలను తీసుకొని వెళ్లి వదిలేసిన వాళ్లతో ఈ సినిమా ట్రైలర్ ని ఓపెన్ చేయడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రతిరోజు కూడా అమ్మాయిల మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయని విషయాన్ని ఛానల్ వాయిస్ తో ఎలివేట్ చేయడం జరిగింది ఈ కేస్ ఇన్వెస్ట్ ఆఫీసర్గా అశ్విన్ బాబు, నందిత శ్వేతా ని రివ్యూ చేశారు.


రెడ్ కలర్ దుస్తులు వేసుకున్న వారందరిని కిడ్నాప్ చేస్తున్నారని ఒక ఐడెంటిటీ గుర్తిస్తారు.. ఆ తర్వాత కిడ్నాప్లను మాత్రం ఆపలేక పోతారు.. దీంతో వారి మిషన్ ఫీల్ అవుతుంది ఇన్వెస్టిగేషన్ ని మరొక యాంగిల్ లో మొదలు పెడతారు. ముఖ్యంగా నాలుగు కొమ్ముల మాస్కుని ఐడెంటిఫై చేయడం తర్వాత ఆ మాస్కు వేసుకొని కిడ్నాప్లు చేస్తోంది ఎవరు వారి వెనుక ఉన్న కథ ఏంటి అనే విషయం పైన ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని డైలాగులు కూడా బాగానే ఆసక్తి కలిగించే కనిపిస్తున్నాయి. ఈ సినిమా ట్రైలర్ పూర్తిగా కంప్లీట్ యాక్షన్ సినిమాగా ఉన్నట్లు ఈ ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది. ఓవరాల్ గా సైకోథ్రిల్లర్ కోణంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: