తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట కమెడియన్ గా మంచి పేరు సంపాదించారు సునీల్.. ఆ తర్వాత హీరోగా మారి పలు చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. ఇవి కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకున్నారు సునీల్. పుష్ప సినిమాలో తన కొత్త యాంగిల్ ను పరిచయం చేయడంతో పలు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి దీంతో స్టార్ హీరోల చిత్రాలలో కూడా సునీల్ నటించిన అవకాశాలను అందుకున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ సైతం విలన్ గా నటించేందుకు సిద్ధంగా ఉన్నారు సునీల్.

హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ గై అనే చిత్రంలో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్లు తిరగేకిస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ్ భాషలలో ఒకేసారి తెరకెక్కించబోతున్నారు. ఇందులో ప్రతి నాయకుడు పాత్రలో సునీల్ ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. తాను రాసుకున్న పాత్రకు సునీల్ అయితే న్యాయం చేయగలుగుతారని భావించిన డైరెక్టర్ అశోక్ వేలముదన్ సునీల్ ని ఎంపిక చేయడం జరిగింది. తెలుగు మార్కెట్ పరంగా కూడా సునీల్ అయితే వర్కౌట్ అవుతారని భావించినట్లు తెలుస్తోంది..


ఇక తమిళంలో అంజలి ఎలాగో హీరోయిన్గా పేరు సంపాదించింది కొన్నేళ్లుగా ఇక్కడే సినిమాలు చేస్తున్న ఈమె తెలుగు నటి అయిన తమిళంలో స్థిరపడిపోయింది జూన్ 9వ తేదీన ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.ముంబై హైదరాబాద్ చెన్నై వంటి పరిసర ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. సునీల్ కెరియర్ కు ఇదొక మంచి అవకాశం అని చెప్పవచ్చు. పుష్ప సినిమా తర్వాత రజనీకాంత్ జైలర్ సినిమాలో కూడా నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇప్పుడు అంజలి సినిమాలో కూడా విలన్ రోల్ లో నటించడంతో సునీల్ కెరీర్ కు ఎలాంటి డోకా లేదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: