ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఎప్పుడూ ఆవేశంగా మాట్లాడడు. చాల వ్యూహాత్మకంగా అతడి మాటలు ఉంటాయి కాబట్టి వివాదాలకు సాధారణంగా ఆయన దూరంగా ఉంటాడు. అయితే తన తీరుకు భిన్నంగా ఈ ప్రముఖ నిర్మాత లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి.లేటెస్ట్ గా అల్లు కాంపౌండ్ నుండి విడుదలైన ‘2018’ డబ్బింగ్ మూవీ సక్సస్ మీట్ లో అరవింద్ ఎవరు ఊహించని కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు. ‘కార్తికేయ 2’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన చందూ మొండేటితో తన బ్యానర్ లో రెండు సినిమాలు వస్తాయని దీనికి సంబంధించి అతడు కమిట్ మెంట్ కూడ ఇచ్చాడు అని చెపుతూ కొందరిలాగా మూలాలు మర్చిపోయి వెన్నుపోటు పొడిచే రకం కాదని దర్శకుడు చెందు మొండేటి పై ప్రశంసలు కురిపించాడు.దీనితో రాజకీయాలలో వెన్నుపోటులు ఉంటాయి కానీ సినిమా రంగంలో వెన్నుపోటు పొడవగల సమర్థుడు ఎవరు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం పరశురామ్ గీత ఆర్ట్స్ తో చేయాల్సిన విజయ్ దేవరకొండ సినిమాని హఠాత్తుగా దిల్ రాజు వైపు వెళ్ళిపోవడంతో అతడిని దృష్టిలో పెట్టుకుని అరవింద్ ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటాడు అంటూ కొందరు ఊహాగానాలు చేస్తున్నారు.


ప్రస్తుతం రామ్ తో బోయపాటి శ్రీను చేస్తున్న మూవీ తర్వాత మళ్ళీ బోయపాటి తో మూవీ ఉంటుందని అరవింద్ చెప్పడంతో బాలకృష్ణ బోయపాటి ల కాంబినేషన్ మూవీని అల్లు అరవింద్ సెట్ చేస్తున్నాడు అంటు ఊహాగానాలు మొదలయ్యాయి. ఏది ఎలా ఉన్నప్పటికీ అల్లు అరవింద్ నోటివెంట వచ్చిన వెన్నుపోటు పదం మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్థుతానికి హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు రాజకీయ నాయకుల నోటివెంట హడావిడి చేసే ఈ వెన్నుపోటు వ్యవహారం ఫిలిం ఇండస్ట్రీలో కూడ ఎంటర్ అయింది అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: